: నేను, షోయబ్ కలిసే ఉన్నాం: సానియా


పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్, భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాల వివాహ బంధం ఒడిదుడుకుల్లో ఉందంటూ వచ్చిన వార్తలపై సానియా తొలిసారి పెదవి విప్పింది. తమ మధ్య విభేదాలు ఏర్పడ్డాయని, షోయబ్ తాను దూరంగా ఉన్నట్లు మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవమని సానియా స్పష్టం చేసింది. తామిద్దరం అన్యోన్యంగానే ఉంటున్నామని చెప్పింది. షోయబ్ సొంతూరు సియల్ కోట్ లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సానియా వెళ్లింది. ఈ సందర్భంగా సానియా తమ వివాహ బంధం గురించి మాట్లాడింది.

"మేమిద్దరం వేర్వేరు దేశాలకు చెందినవాళ్లం. ఇద్దరూ క్రీడాకారులం కావడంతో మాపై ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి సమస్యలను అధిగమిస్తున్నాం. షోయబ్ కు, నాకు మధ్య ఎలాంటి గొడవల్లేవు. నా భర్తతో కలిసి విశ్రాంతి తీసుకునేందుకు సియల్ కోట్ వచ్చాను" అని సానియా చెప్పింది. సానియా ఇటీవల కొంతకాలం హైదరాబాదులో ఉంటుండటంతో షోయబ్ తో విడిపోయిందంటూ ఆ మధ్య వదంతులు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News