: ఇప్పుడిక బీజేపీ నిరశన దీక్ష
విద్యుత్ సమస్యపై ప్రతిపక్షాలు నిరాహార దీక్షల కోసం క్యూ కట్టినట్లున్నాయి. తాజాగా బీజేపీ కూడా నేటి నుంచి విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ నిరాహార దీక్షకు దిగుతోంది..
త్వరలో పెంచబోతున్న విద్యుత్ చార్జీలను నిరసిస్తూ, ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ వామపక్షాలు ఈ నెల 23 నుంచి ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేశాయి. మూడు రోజుల దీక్ష తర్వాత నేతల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో ప్రభుత్వం బలవంతంగా పోలీసులతో దీక్షను భగ్నం చేసి నిమ్స్ ఆస్పత్రికి తరలించింది.
ఫలితం లేకపోవడంతో వామపక్ష నేతలు మరుసటి రోజు తమ దీక్షను విరమించారు. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర మూడు రోజుల క్రితం దీక్ష ప్రారంభించగా.. రాత్రి పోలీసులు రంగంలోకి దిగి వారిని బలవంతంగా నిమ్స్ కు తరలించారు. వామపక్ష నేతల్లాగే వారు కూడా ఈ రోజు దీక్ష విరమించారు.
ఇక్కడ ఇప్పుడు 'మేము సైతం' అంటూ బీజేపీ నేతలు కూడా విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ నేటి నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో దీక్ష ప్రారంభిస్తున్నారు. అంటే విద్యుత్ సమస్యపై ఇది ముచ్చటగా మూడో నిరశన దీక్ష కానుంది. మొత్తానికి సర్కారుపై పోరుకు అన్ని పార్టీలు ఈ ఆయుధాన్నే ఎక్కుపెట్టడం విశేషం.