: బీజేపీ సీనియర్ నేత ఆలె నరేంద్ర మృతి


బీజేపీ సీనియర్ నేత ఆలె నరేంద్ర (68) మృతి చెందారు. గత కొంత కాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్న ఆయన నాంపల్లిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బీజేపీ నేతగా, టైగర్ నరేంద్రగా కీర్తినందుకున్న ఆయన, పార్టీ వీడి తెలంగాణ సాధన సమితి పేరిట సొంత పార్టీ పెట్టారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు తన పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసి మెదక్ ఎంపీగా ఎన్నికయ్యారు.

పాస్ పోర్టు కుంభకోణంలో ఆయన హస్తముందని ఆరోపణలు రావడంతో టీఆర్ఎస్ నుంచి ఆయనను సస్పెండ్ చేశారు. వెంటనే బీజేపీలో చేరిన ఆయన అనారోగ్యం కారణంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎన్నికల వేళ ఆయన మృతి చెందడంతో బీజేపీ నేతలు విచారంలో మునిగిపోయారు.

  • Loading...

More Telugu News