: బాలకృష్ణ ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయిస్తాం: చంద్రబాబు


సినీ నటుడు బాలకృష్ణ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తానెక్కడి నుంచి పోటీ చేయాలో పార్టీయే నిర్ణయిస్తుందని బాలయ్య కూడా అన్నారు. తాజాగా దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ, బాలకృష్ణ పోటీపై ఆయనతోనే మాట్లాడతానని చెప్పారు. చర్చించాక ఎక్కడ నుంచి పోటీ చేయాలో నిర్ణయిస్తామన్నారు. కాగా, రేపు సీమాంధ్ర అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News