: కట్నం వేధింపుల కేసులో ఒడిశా మాజీ న్యాయశాఖ మంత్రి అరెస్టు


ఒడిశా మాజీ న్యాయశాఖ మంత్రి రఘునాథ్ మొహంతిని ఈ ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. అదనపు కట్నంకోసం వేధిస్తున్నారంటూ మొహంతి కోడలు బర్షాసోని ఈ నెల మొదట్లో స్థానిక బాలాసోర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దాంతో వెంటనే తన పదవికి రాజీనామా చేసిన ఆయన ఆ వెంటనే అదృశ్యమయ్యారు.

ఫిర్యాదులో పేర్కొన్న కుటుంబ సభ్యులందరిపైనా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే ఈ రోజు కోల్ కతాలో పోలీసులు మొహంతిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈనెల 17వ తేదీనే ఆయన కుమారుడు రాజశ్రీ మొహంతిని అరెస్టు చేశారు. 

  • Loading...

More Telugu News