: అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత అమిత్ షా
బీజేపీ నేత అమిత్ షా అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులో తనను అరెస్టు చేయకుండా స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో మాట్లాడిన షా, 'ముజఫర్ నగర్ అల్లర్లలో మిమ్మల్ని అవమానించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే బీజేపీకే ఓటు వేయండి' అని వ్యాఖ్యానించారు. వెంటనే ఈ వివాదాస్పద మాటలపై రెండు కేసులు నమోదవగా, మరోపక్క ఎన్నికల సంఘం కూడా వీటిని పరిశీలిస్తోంది.