: రెండున్నర కోట్ల రూపాయల విలువైన పెయింటింగ్ మట్టిపాలు


రెండున్నర కోట్ల రూపాయల ఖరీదైన చిత్రాన్ని హోటల్ సిబ్బంది చెత్తబుట్ట పాల్జేసిన వైనం చైనాలో జరిగింది. చైనా కళాకారుడు క్యూరుజో వేసిన ఒక చిత్రాన్ని బీజింగ్ కు చెందిన పాలీ కల్చర్ ఈ సోమవారం హాంగ్ కాంగ్ లోని గ్రాండ్ హయత్ హోటల్లో వేలం వేసింది. 37లక్షల డాలర్లకు అమ్ముడుపోయింది. కానీ, ఆ తర్వాత నుంచీ ఆ పెయింటింగ్ కనిపించకుండా పోయింది. రంగంలోకి దిగిన పోలీసులకు తెలిసిందేమంటే హటల్ లో క్లీనింగ్ సిబ్బంది ఆ పెయింటింగ్ ను చెత్తలో పారేశారని. ఈ చెత్తను కాస్తా పూడ్చి పెట్టి ఉండవవచ్చని భావిస్తున్నారు. ఇప్పుడు ఆ ఖరీదైన పెయింటింగ్ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. అయితే, హోటల్ యాజమాన్యం మాత్రం పోలీసుల ఆరోపణలను తోసిపుచ్చింది. తమ సిబ్బంది ఆ పెయింటింగ్ ను పారేయలేదని స్పష్టం చేసింది

  • Loading...

More Telugu News