: రెబల్ అభ్యర్థిగా ఎంపీ పాల్వాయి కుమార్తె నామినేషన్
నల్గొండ జిల్లా మునుగోడులో రెబల్ అభ్యర్థిగా ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె స్రవంతి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. కొంతకాలంగా ఈ స్ధానం తన కుమార్తెదేనని, కాంగ్రెస్ టికెట్ ఇస్తుందని పలుమార్లు చెబుతూ వచ్చారు. అయితే, తాజాగా ఒక కుటుంబానికి ఒక టికెట్ అని కాంగ్రెస్ చెప్పడంతో పాల్వాయి కూతురికి సీటు దక్కలేదు దాంతో, రెబల్ అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నారు.