: నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా బయల్దేరిన దానం నాగేందర్
మాజీ మంత్రి దానం నాగేందర్ నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఖైరతాబాద్ శాసనసభా స్థానానికి నామినేషన్ దాఖలు చేసేందుకు దానం భారీ ర్యాలీగా బయల్దేరారు. తన అనుచరులతో, కార్యకర్తలతో ఉత్సాహంగా బయల్దేరిన దానం గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. తాను విజయం సాధిస్తే నియోజకవర్గంలోని మురికివాడలకు మౌలిక సదుపాయాలు కలుగజేస్తానని ఆయన హామీ ఇచ్చారు.