: ఆప్ లో చిచ్చు పెట్టిన మల్కాజ్ గిరి
దేశంలో మెట్రోపాలిటన్ నగరాలకు పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీలో మల్కాజ్ గిరి నియోజకవర్గం చిచ్చురేపింది. దేశంలోని అతిపెద్ద లోక్ సభ స్థానాలలో ఒకటైన మల్కాజ్ గిరిపై అన్ని రాజకీయపార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. ఆప్ తరపున మల్కాజ్ గిరికి పోటీ చేసేందుకు చందనా చక్రవర్తిని అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆమె ప్రచారకార్యకలాపాలకు ఏర్పాట్లు చేసుకున్నారు.
ఇంతలో ఆప్ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు మనవడు ఎన్.వీ. సుధాకిరణ్ కు మల్కాజ్ గిరి సీటు కేటాయిస్తున్నట్టు పేర్కొంది. దీంతో చిచ్చు రేగింది. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పోటీ నుంచి తప్పుకునేందుకు చందనా చక్రవర్తి నిర్ణయించగా ఆమె మద్దతుదారులు మండిపడుతున్నారు. ఆది నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని కాదని, పార్టీకి సంబంధం లేని వారికి టికెట్ ఎలా కేటాయిస్తారంటూ పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట వారు ధర్నా చేపట్టారు.
దీంతో సుధాకిరణ్ మాట్లాడుతూ, తాను పార్టీ ప్రారంభం నుంచి ఆమ్ ఆద్మీతో కొనసాగుతున్నానని, సభ్యత్వం కూడా తీసుకున్నానని తెలిపారు. తనకు పోటీ చేయాలనే కోరిక లేదని, అయితే పార్టీ టికెట్ కేటాయించడంతో పోటీలో నిలబడ్డానని ఆయన తెలిపారు.