: జనగామపై కల్వకుంట్ల కవిత చూపు
తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ర్ట సమితి పేరుతో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన కుమారుడు తారకరామారావు, మేనల్లుడు హరీశ్ రావు ఇప్పటికే ప్రజా ప్రతినిధులుగా పోరు సాగిస్తున్నారు. ఇక చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత మాత్రం రాజకీయాలకు వెలుపలే తెలంగాణ జాగ్రుతి సంస్థ పేరుతో పరోక్షంగా తెలంగాణ కోసం పాటు పడుతున్నారు. త్వరలో కవిత కూడా తండ్రి వారసత్వాన్ని అందుకుని రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నారని సమాచారం.
కవిత ప్రత్యక్ష ఎన్నికల కార్యాచరణలోకి దిగాలని కోరుకుంటున్నారు. వరంగల్ జిల్లా జనగామ స్థానం నుంచి వచ్చే సాధారణ ఎన్నికలలో అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమానికి మంచి పట్టున్న వరంగల్ జిల్లాలో పోటీ చేయడం అనుకూలిస్తుందని కవిత ఆశ. తన అభిప్రాయాన్ని ఇప్పటికే తండ్రికి కూడా చెప్పారట.
ఇప్పడు పొన్నాల లక్ష్మయ్య జనగామ స్థానంకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే మరోసారి ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి పొన్నాల ఆసక్తిగా లేరని, బదులుగా ఆయన కోడలు వైశాలి అక్కడి నుంచి పోటీ చేయవచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే ఇక్కడ నారీభేరీ మోగడం ఖాయం.

కాదు కూడదంటే జనగామ కాకుండా నిజామాబాద్ స్థానం నుంచి పోటీ చేయాలని కవిత అనుకుంటున్నారట.
మొత్తానికి కవిత కూడా రాజకీయాలలోకి వస్తే టీఆర్ఎస్ జోరు పెరగడం ఖాయం. ఎందుకంటే కవితకు మహిళలలో మంచి ఆదరణ ఉంది. అవి ఓట్ల రూపంలోకి మళ్లితే టీఆర్ఎస్ కు ఎంతోకొంత లాభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మొత్తానికి కవిత కూడా రాజకీయాలలోకి వస్తే టీఆర్ఎస్ జోరు పెరగడం ఖాయం. ఎందుకంటే కవితకు మహిళలలో మంచి ఆదరణ ఉంది. అవి ఓట్ల రూపంలోకి మళ్లితే టీఆర్ఎస్ కు ఎంతోకొంత లాభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.