: ఐశ్వర్యారాయ్ మరో బిడ్డ కోసం రెడీ అవుతోందా?
అందచందాలతో, నటనతో కోట్లాది మంది హృదయాలను మీటిన ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఇక ఇంటికే పరిమితమా? ఇప్పట్లో ఆమెను కొత్త చిత్రాల్లో చూడలేమా? అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే అంతేననిపిస్తోంది. అభిషేక్, ఐశ్వర్యలకు ఆరాధ్య 2011 నవంబర్ లో జన్మించింది. ఆమెకు ఇప్పుడు రెండున్నరేళ్లు. ప్లే స్కూల్ కి కూడా పంపిస్తున్నారు. దీంతో వ్యక్తిగత జీవితంపై ఐశ్వర్య ఎంతో సంతృప్తిగా ఉన్నారని, ఈ నేపథ్యంలో ఆమె రెండో బిడ్డను కనేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం.
ఆరాధ్య కడుపులో ఉండగానే ఐశ్వర్య నటన నుంచి విరామం తీసుకుంది. దీంతో ఆమె మూడేళ్ల నుంచి సినిమాలకు దూరంగా వుంది. మధ్యలో కేవలం కొన్ని ప్రకటనల్లో తళుక్కుమంది. మణిరత్నం సినిమాలో నటించేందుకు ఆమె అంగీకరించినట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. కానీ ఆమె వాటిని ధ్రువీకరించలేదు. అయితే, ఐశ్వర్య కాల్షీట్ల కోసం నిర్మాతలు ప్రయత్నిస్తున్నా ఆమె నుంచి సానుకూలత రావడం లేదని, దీంతో ఇప్పట్లో ఐశ్వర్యను తెరపై చూడకపోవచ్చని చిత్ర పరిశ్రమ వర్గాలు తెలిపాయి.