: సహకార విజయం కార్యకర్తలదే: పాల్వాయి


తాజాగా రాష్ట్రంలో జరిగిన సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని కొందరు తమదిగా అధిష్ఠానం వద్ద చెప్పుకుని, పార్టీని నష్టపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ విజయం పార్టీదో, రాష్ట్ర ప్రభుత్వానిదో కాదనీ, ఇది పూర్తిగా  కార్యకర్తల విజయమనీ ఆయన చెప్పారు.

అయితే గత ఉప ఎన్నికల్లో ఫలితాలను మరచి, పార్టీ పెద్దలు కొందరు ఇలా తమ అకౌంటులో వేసుకుంటున్నారని ఆయన చురక వేశారు. హైదరాబాదులో  
సి యల్ పి  కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన పాల్వాయి, పోలవరం టెండర్లను 87 శాతం పెంచడంపై ప్రశ్నించారు. ఎవరి సొత్తని ఇలా పెంచుకున్నారనీ, అది సాధ్యమయ్యే ప్రాజెక్టు కాదనీ ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News