: జై సమైక్యాంధ్ర పార్టీ ఎంపీ అభ్యర్థిపై టీఆర్ఎస్ దాడి


ప్రజాస్వామ్యం సిగ్గుతో తలవంచుకోవాల్సిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. భారత రాజ్యాంగం భారతీయులు ఎవరైనా ఎక్కడ్నుంచైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని చెబుతోంది. దీనికి విరుద్ధంగా టీఆర్ఎస్ పార్టీ ప్రవర్తిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. తాజాగా ఖమ్మం జిల్లా మధిరలో జై సమైక్యాంధ్ర పార్టీ ఎంపీ అభ్యర్థి నాగార్జునరావు ప్రయాణిస్తున్న వాహనంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. నాగార్జునరావును అటకాయించిన టీఆర్ఎస్ కార్యకర్తలు ఆతని కారు అద్దాలను ధ్వంసం చేశారు. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News