: మలేసియా విమానం బ్లాక్ బాక్స్ నుంచి మళ్లీ సిగ్నల్స్ వచ్చాయి


శతాబ్ధపు అతిపెద్ద మిస్టరీ వీడనుంది. గత నెల 8న అదృశ్యమైన మలేసియా విమానం కోసం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో పెర్త్ కి 2261 కిలోమీటర్ల దూరంలో 15 విమానాలు, 14 నౌకలు నిరంతరాయంగా అన్వేషిస్తున్నాయి. గత నెలలో ఒకసారి విమానం బ్లాక్ బాక్స్ నుంచి వచ్చిన సిగ్నల్స్ ఆగిపోయాయి. వాటి ఆధారంగా వెతుకులాట ప్రారంభించిన అన్వేషణ బృందాలకు ఆ తరువాత ఎలాంటి ఆచూకీ లభించలేదు. తాజాగా సుదీర్ఘమైన సిగ్నల్స్ లభించడంతో మలేసియా విమానం ఆచూకీపై ఆశలు చిగురించాయి.

తొలి సిగ్నల్ రెండు గంటల 20 నిమిషాలపాటు ఉండగా, నిన్న అందిన సిగ్నల్స్ అయిదున్నర నిమిషాలపాటు, ఏడు నిమిషాల నిడివితో ఉన్నాయి. దీంతో సిగ్నల్స్ లభించాయని అంచనా వేస్తున్న ప్రాంతంలో నిఘానౌకలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఆస్ట్రేలియన్ నౌకకు అండర్ వాటర్ సిగ్నల్స్ ను గుర్తించే పింగర్ లొకేటర్ అనే సాధనం ఉంది.

ఇది బ్లాక్ బాక్స్ సిగ్నల్స్ ను గుర్తించగలుగుతుంది. విమానం మునిగిపోయిందని భావిస్తున్న ప్రాంతంలో పలు శకలాలు, వస్తువులు కూడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. బ్లాక్ బాక్స్ కోసం స్పెషలిస్టు డైవర్లు వెతుకుతున్నారు.

  • Loading...

More Telugu News