: కేసీఆర్ విజన్ నచ్చింది: అల్లు అర్జున్ మామ


తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని ప్రముఖ హీరో అల్లు అర్జున్ మామగారు శేఖర్ రెడ్డి ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ తరపున రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ టికెట్ దక్కించుకున్న నేపథ్యంలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. తాను తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నానని చెప్పారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన ఉద్యమాన్ని ఆయన మెచ్చుకున్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధిపై కేసీఆర్ భవిష్యత్ ప్రణాళిక నచ్చే టీఆర్ఎస్ లో చేరినట్లు శేఖర్ రెడ్డి చెప్పారు.

  • Loading...

More Telugu News