: ధోనీ వాంగ్మూలాన్ని పరిశీలించేందుకు అనుమతివ్వండి: బీసీసీఐ
సంచలనం సృష్టించిన ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ స్కాండల్ పై బీసీసీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఈ మేరకు జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీకి భారత జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసన్, ఐపీఎల్ సీఓఓ సుందర్ రమణ్ ఇచ్చిన వాంగ్మూల రికార్డులను పరిశీలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది.