: పీజీ వైద్య పరీక్ష రద్దుపై హైకోర్టులో పిటిషన్
పీజీ వైద్య ప్రవేశ పరీక్షను రద్దు చేస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పీజీ వైద్య ప్రవేశ పరీక్షలో అక్రమాలు జరిగాయని, ప్రశ్న పత్రాలు లీకయ్యాయని బయటపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును సీఐడీ విభాగం దర్యాప్తు చేస్తోంది. ప్రశ్న పత్రాలను కొందరు అభ్యర్థులు ముందుగానే సంపాదించడం, వారికి పరీక్షల్లో మంచి మార్కులు వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో గవర్నర్ ఆదేశాల మేరకు తిరిగి పరీక్ష నిర్వహించాలని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నిర్ణయించింది. దీనిని సవాల్ చేస్తూ పరీక్ష రాసిన కొందరు అభ్యర్థులు ఈ రోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన కోర్టు కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.