: వైఎస్సార్సీపీలో చేరిన దర్శకుడు కోదండరామిరెడ్డి


ప్రముఖ సినీ దర్శకుడు కోదండరామిరెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. ఈ ఉదయం ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించిన ఆయన స్వస్థలం నెల్లూరు జిల్లా ఇందుకూరు పేట మండలం మైపాడు. కాగా, పశ్చిమగోదావరి జిల్లా తణుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు కూడా వైఎస్సార్సీపీలో చేరారు.

  • Loading...

More Telugu News