: నామాను అడ్డుకున్న ఎమ్మెల్సీ బాలసాని వర్గీయులు
తెలంగాణ టీడీపీలో ఓ వర్గం నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ నుంచి ఖమ్మంలో బీసీలకు టికెట్లు వస్తాయని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఆశించారు. కానీ, పార్టీ మొండిచేయి చూపడంతో ఆయన అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. తమకు టికెట్ రాకుండా ఎంపీ నామా నాగేశ్వరరావు అడ్డుపడ్డారని బాలసాని వర్గీయులు మండిపడ్డారు. దాంతో, పరామర్శించేందుకు నామా ఆయన ఇంటికి వెళ్లారు. ఆగ్రహించిన బాలసాని వర్గీయులు అక్కడకు వచ్చిన నామాను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో నామా, బాలసాని వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.