: టీడీపీ నేతలను పరామర్శించిన చంద్రబాబు సతీమణి


హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నేతలను చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈ ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని ఆమె అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఆస్పత్రిలోనూ దీక్షలు కొనసాగిస్తామని నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం విద్యుత్ సమస్యలపై దిగొచ్చేవరకూ తమ దీక్షలు ఆగవని స్పష్టం చేశారు. కాగా,  టీడీపీ నేతలు చేస్తున్న దీక్షలను నిన్న అర్ధరాత్రి  హఠాత్తుగా ప్రభుత్వం భగ్నం చేసింది. చికిత్స నిమిత్తం నేతలను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. 

  • Loading...

More Telugu News