: ప్రారంభమైన ఈటీవీ-3 తెలంగాణ ఛానల్


ఈటీవీ-3 తెలంగాణ ఛానల్ ను ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఛానెల్ ప్రసారాలను దివంగత సుమన్ తనయుడు సుజయ్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ సీహెచ్.రామోజీరావు, ఈనాడు పత్రిక ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ రామ్మోహన్ రావు, ఈటీవీ సీఈవో బాపినీడు, డాల్ఫిన్ హోటల్స్ ఎండీ విజయేశ్వరి, సంస్థ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News