: కరీంనగర్ లో 15న సోనియా బహిరంగ సభ
సుదీర్ఘ కాలం తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా తెలుగు నేలపై అడుగుపెట్టనున్నారు. తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్ జిల్లాలో ఈ నెల 15వ తేదీన నిర్వహించే బహిరంగసభలో సోనియాగాంధీ పాల్గొంటారు. 2004లో జరిగిన కరీంనగర్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలు తనకు తెలుసునని సోనియా హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో సోనియాగాంధీ నిర్ణయం కీలకంగా మారిన విషయం విదితమే. తెలంగాణలో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించే దిశగా పార్టీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే కరీంనగర్ పట్టణంలో సోనియా సభను ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్ ఎంపీగా పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు.