: దీదీ అభ్యర్థనను తిరస్కరించిన ఈసీ
అధికారుల బదిలీపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ అభ్యర్థనను ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఐదుగురు ఎస్పీలు, కలెక్టర్ బదిలీ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఎన్నికల సంఘానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిని ఎన్నికల సంఘం తిరస్కరించి, వారిని బదిలీ చేయాల్సిందేనని పట్టుబట్టింది.