: తెలంగాణలో టీడీపీకి ఒక్క సీటు కూడా రాదు: రఘువీరా


తెలంగాణలో ఈసారి తెలుగుదేశం పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి జోస్యం చెప్పారు. హైదరాబాదులోని గాంధీభవన్ లో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రలో ఈసారి కాంగ్రెస్ పార్టీ 70 శాతం టిక్కెట్లను కొత్తవారికే ఇస్తోందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ యువత, బీసీలకే ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు.

175 అసెంబ్లీ స్థానాలకు 1300 దరఖాస్తులు వచ్చాయని ఆయన మీడియాకు వెల్లడించారు. చిరంజీవి అభిమానులు కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని రఘువీరా సూచించారు. కాంగ్రెస్ లోని అన్ని విభాగాల్లో చిరు అభిమానులకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News