: బాబ్బాబు... అతన్ని విడుదల చేయరూ!: తాలిబాన్లకు పాక్ విజ్ఞప్తి


గత ఏడాది కిడ్నాపైన అవామీ నేషనల్ పార్టీ (ఎఎన్పీ) నేత అర్బాబ్ జహీర్ ను విడుదల చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం తాలిబాన్లకు విజ్ఞప్తి చేసింది. మాజీ ప్రధాని కుమారుడు అలీ హైదర్ ను కూడా విడుదల చేయాలంటూ పాక్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు జైల్లో ఉన్న కొందరు తాలిబాన్ నేతలను విడుదల చేశామని తెలిపింది. దీనిపై రేపు క్వెట్టాలో పర్యటించే పాక్ అధ్యక్షుడు మమ్మూన్ హుస్సేన్ తో వివిధ పార్టీలకు చెందిన నేతలు చర్చించే అవకాశం ఉంది. గతేడాది అర్బాబ్ జహీర్ ఖాసీను క్వెట్టాలో కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. చర్చల్లో భాగంగా ఇప్పటి వరకు తెహ్రీ వర్గానికి చెందిన తాలిబాన్లు 19 మందిని పాక్ ప్రభుత్వం విడుదల చేసింది.

  • Loading...

More Telugu News