: మోడీతో దిగంబర్ ఢీ
గుజరాత్ లోని వడోదరలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో ఆమ్ ఆద్మీ పార్టీ నేత సునీల్ దిగంబర్ కులకర్ణి ఢీ కొట్టనున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న సునీల్ దిగంబర్ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. సునీల్ కు సామాజిక కార్యకర్తగా గుర్తింపు ఉంది. వారణాసి లోక్ సభ నియోజకవర్గంలో మోడీని అరవింద్ కేజ్రీవాల్ ఎదుర్కొంటున్నారు. వడోదర నియోజకవర్గానికి ఏప్రిల్ 30న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.