: వారణాసి లోక్ సభ అభ్యర్థిగా అజయ్ రాయ్
వారణాసి లోక్ సభ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే అజయ్ రాయ్ పేరును కాంగ్రెస్ ఖరారు చేసింది. బీజేపీ తరపున ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న నరేందర్ మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ కు ఆయన ప్రత్యర్థి. అయితే, ఉత్తరాదిన మోడీ ప్రభావం బాగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఈ సీటును ఓ సిట్టింగ్ శాసనసభ్యుడికి ఇవ్వడం గమనార్హం.