: వివాహితపై అత్యాచారం కేసులో 22 ఏళ్ల కుర్రాడు అరెస్ట్


చట్టాలను ఎంత కఠినంగా అమలు చేసినా కామాంధులకు కనువిప్పు కలగడం లేదు. రోజురోజుకీ మహిళలపై లైంగిక దాడులు పెరుగుతూనే ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇటీవల జరిగిన అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.

ముంబై శివార్లలోని గోరెగావ్ ప్రాంతంలో వివాహితపై అత్యాచారం చేసిన 22 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి ఆరే కాలనీలోని ఓ మురికివాడలో ఉండే సద్దాం ఖాన్, అదే ప్రాంతంలో ఉండే ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తాను ఒంటరిగా ఉన్న సమయం చూసి ఇంట్లోకి చొరబడి, నోరు నొక్కి అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని అతడు బెదిరించినట్లు ఆమె చెప్పింది.

తీవ్ర భయాందోళనలకు గురైన బాధితురాలు... తన భర్తకు ఈ విషయం చెప్పడానికి చాలా భయపడింది. చిట్టచివరకు ధైర్యం చేసి మూడు రోజుల తర్వాత జరిగిన ఘటనను భర్తకు చెప్పడంతో ఈ ఘోరం వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడు సద్దాం ఖాన్ ను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఇంతకు ముందు కూడా అదే పోలీస్ స్టేషన్ లో అతడిపై ఓ అత్యాచారం కేసు నమోదైనట్లు పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News