: పొన్నాల నివాసం వద్ద మహిళా నేతల ధర్నా
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నివాసం వద్ద మహిళా కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. రాజేంద్రనగర్ టికెట్ తనకు ఇవ్వాలని సదాలక్ష్మి, నిజామాబాద్ టికెట్ తనకు ఇవ్వాలని ఆకుల లలిత ఆందోళన చేస్తున్నారు. సీట్ల కేటాయింపుల్లో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. బహిరంగ సభలు నిర్వహించే సమయంలో మాత్రమే మహిళలు గుర్తొస్తారా? అంటూ నిలదీశారు. ఓడిపోయే అభ్యర్థులకే కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయిస్తోందని... వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు మాత్రం అన్యాయం చేస్తోందని ఆరోపించారు.