: దుబాయ్ లో అనిల్ కపూర్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ


బాలీవుడ్ నటుడు, నిర్మాత అనిల్ కపూర్ దుబాయ్ లో ఓ ఎంటర్ టైన్మెంట్ సంస్థను ప్రారంభించబోతున్నాడు. 'ఆంటిలా వెంచర్స్ పేరుతో ఈ కంపెనీనీ తీసుకురానున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇటీవల దుబాయ్ వెళ్లిన అనిల్ అక్కడి వార్తా సంస్థలతో మాట్లాడుతూ.. ఈ ఎంటర్ టైన్మెంట్ కంపెనీలో కంటెంట్ క్రియేషన్, ఫిల్మ్ మేకింగ్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ స్టూడియో, టాలెంట్ మేనేజ్ మెంట్ వివిధ అంశాలు ఉంటాయని చెప్పాడు. అంతర్జాతీయ మార్కెట్ కు దుబాయ్ బాగా తోడ్పడుతుందని, త్వరలో అక్కడ ఆఫీస్ కూడా తెరవబోతున్నట్లు తెలిపాడట.

  • Loading...

More Telugu News