: చంద్రబాబు అవకాశవాది: సీపీఎం నేత సీతారాం ఏచూరి
టీడీపీ అధినేత చంద్రబాబు పక్కా రాజకీయ అవకాశవాది అని సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. ఈరోజు న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. గుజరాత్ అల్లర్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మూలకారణమని చంద్రబాబు గతంలో ఆరోపించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇవాళ అదే చంద్రబాబు మోడీని ప్రధాని చేయాలంటున్నారని సీతారాం విమర్శించారు.
చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. బీజేపీతో టీడీపీ పొత్తును ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. రాష్ట్రానికి చెందిన పార్టీ సీనియర్ నేత నోముల నర్సింహయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరడంపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. ఆ అంశంపై రాష్ట్ర పార్టీ స్పందిస్తుందని సీతారాం ఏచూరి అన్నారు.