: రాష్ట్రాన్ని పాలించే శక్తి టీడీపీకే ఉంది: బాబు


పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్న నేపథ్యంలో రాష్ట్రాన్ని పాలించే శక్తి తెలుగుదేశం పార్టీకే ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. బాబు ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సమస్యలు తీవ్రతరమవుతున్నాయని, ప్రభుత్వం చేతగానితనం వల్ల ప్రజలు కష్టాలు పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ను దీటుగా ఎదుర్కొనగలిగే శక్తి టీడీపీకే ఉందని బాబు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ,  అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకుని, పిల్ల కాంగ్రెస్ పార్టీ పెట్టారని బాబు ఆరోపించారు. వారు అసెంబ్లీలో అడుగుపెడితే అక్కడా దోపిడీ చేస్తారని బాబు ఎద్దేవా చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు నాలుగు రోజులు చేస్తున్న నిరాహార దీక్షలు ప్రజలకోసమే అని చెప్పారు. తమకు అధికార కాంక్ష లేదని, ప్రజల కష్టాలు తీర్చేందుకే టీడీపీ పోరాటమని బాబు స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News