: అక్రమ సొత్తులో ఆంధ్రప్రదేశ్ రికార్డు
ఎన్నికల వేళ ఓట్ల కోసం నేతలు ధన ప్రవాహానికి తెరతీయడంతో నోట్ల కట్టలు పట్టుబడుతూ ఉన్నాయి. ఈ విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మరే రాష్ట్రానికీ అందనంత ఎత్తులో ఉంది. ఇప్పటి వరకు రూ.195 కోట్లు పట్టుబడగా... అందులో సింహ భాగం రూ.118 కోట్లు ఆంధ్రప్రదేశ్ లోనే స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక ఈసీ అధికారులు 26 లక్షల లీటర్ల మద్యం, 70 కేజీల హెరాయిన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల చట్టం, ప్రవర్తనా నియమావళికి సంబంధించి 11,469 కేసులు నమోదైనట్లు ఈసీ తెలిపింది.