: విశాఖలో మతిస్థిమితం లేని మహిళపై కీచకుల సామూహిక అత్యాచారం
విశాఖపట్టణంలోని షిప్పింగ్ హార్బర్ లో దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతి బిగ్గరగా రోదిస్తూ స్థానికులకు జరిగిన విషయాన్ని వెల్లడించడంతో... స్థానికులు అక్కడే అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు యువకుల్ని పట్టుకున్నారు. వీరిలో ఒకడు చాకచక్యంగా తప్పించుకోవడంతో... ఆగ్రహించిన స్థానికులు మిగిలిన ఇద్దరికీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, మూడో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.