: భద్రాచలం గర్భగుడిలోకి ఆయుధంతో వెళ్లిన గన్ మెన్
భద్రాచలం రామాలయంలో ఘోర అపచారం జరిగింది. ఓ గన్ మెన్ ఏకంగా తుపాకితో గర్భగుడిలోకి ప్రవేశించాడు. టీటీడీ తరపున రాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఛైర్మన్ కనుమూరి బాపిరాజు ఆలయానికి విచ్చేశారు. ఆయనతో పాటే ఆయన గన్ మెన్ కూడా ఆయుధంతోపాటు గర్భగుడిలోకి ప్రవేశించాడు. ఆలయంలోకి ఆయుధాలు తీసుకెళ్లరాదనే నిబంధన ఉన్నప్పటికీ వారు పట్టించుకోలేదు. ఆలయ అధికారులు కూడా చూస్తూ మిన్నకుండిపోయారు. ఈ ఘటన భద్రాచలం ఆలయంలోని భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది.