: ఈ ఏడాది చివర్లో సివిల్స్ మెయిన్స్


దేశంలో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లకు అర్హత పరీక్షగా పేరుగాంచిన సివిల్స్ మెయిన్స్ ఈ ఏడాది చివర్లో ఉంటుందని యూపీఎస్సీ తెలిపింది. నవంబర్ లోగానీ, డిసెంబర్ లోగానీ ఈ ప్రధాన పరీక్ష నిర్వహిస్తామని యూపీఎస్సీ పేర్కొంది. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను మే 26న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇంగ్లీషును తప్పనిసరి చేస్తూ ఇంతకుముందు యూపీఎస్సీ తీసుకున్న నిర్ణయంపై దేశం నలుమూలల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో, ఇంతకుముందులానే పరీక్షలు నిర్వహించాలని యూపీఎస్సీ నిర్ణయించింది. కాగా, ప్రిలిమినరీ పరీక్షకు ఆన్ లైన్ ద్వారా ఏప్రిల్ 4 లోగా దరఖాస్తు చేసుకోవాలి. 

  • Loading...

More Telugu News