: పోటీ నుంచి వైదొలగిన సోనియా ప్రత్యర్థి...ఆప్ ఆభ్యర్థి


ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. అభ్యర్థులు ఎత్తులు పైఎత్తులతో దూసుకుపోతున్నారు. ఈ దశలో ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ అధినేత్రి పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నియోజకవర్గంలో సోనియా గాంధీకి ప్రత్యర్థిగా బరిలో దిగిన ఫరూకుద్దీన్ పోటీ నుంచి వైదొలిగారు.

విశ్రాంత న్యాయమూర్తి ఫరూకుద్దీన్ తనంతట తాను పోటీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారని ఆప్ రాష్ట్ర అధికార ప్రతినిధి వైభవ్ మహేశ్వరి స్పష్టం చేశారు. ఫరూకుద్దీన్ మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ హైకోర్టుల్లో జడ్జిగా పని చేశారు. దీంతో రాయ్ బరేలీ నుంచి సామాజిక కార్యకర్త అర్చన శ్రీవాత్సవను సోనియాకు పోటీగా నిలబెట్టాలని ఆప్ నిర్ణయించింది.

  • Loading...

More Telugu News