: అమెరికన్లకు భారత్, చైనీయుల నుంచి పోటీ: ఒబామా
భారత్, చైనీయుల నుంచి అమెరికన్లు పోటీని ఎదుర్కొంటున్నారని ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. యువ అమెరికన్లు తలచుకుంటే వారిలా, వారికంటే ఎక్కువే సాధించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒబామా మేరీలాండ్ వర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. భారత్, చైనీయలు ప్రపంచ ఆర్థిక రంగంలో పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారని, మీరూ వారితో పోటీపడగలరంటూ ప్రోత్సహించారు. ప్రతీ అమెరికా విద్యార్థి అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడనే నమ్మకం తనకు ఉందన్నారు.