: కోర్టు ముందుకు పీజీ వైద్య విద్య స్కాం నిందితులు


ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పీజీ వైద్య విద్య ప్రవేశ పరీక్ష కుంభకోణం కేసులో తాజాగా పదకొండు మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం నిందితుల్ని విజయవాడ నుంచి హైదరాబాదు తరలించి మూడో అదనపు మెట్రో పాలిటన్ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. వారిలో ఏడుగురు మధ్యవర్తులు, నలుగురు వైద్య విద్యార్థులు ఉన్నారు. నిందితులకి జడ్జి రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అనంతరం విజయవాడ సబ్ జైలుకు తరలించారు. గతంలో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకోగా వీరితో కలిపి 20 మంది అయ్యారు.

  • Loading...

More Telugu News