: యువరాజ్ పనైపోలేదు: సచిన్


టీ20 ప్రపంచకప్ లో విఫలమైన యువరాజ్ సింగ్ కు మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండ్కులర్ కూడా బాసటగా నిలిచాడు. యువరాజ్ ఆటతీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవడంతోపాటు, ఆయన ఇంటిపై రాళ్ల దాడి కూడా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సచిన్ ఫేస్ బుక్ లో స్పందించాడు. యువరాజ్ కాస్త వెనుకబడ్డాడేగానీ, అతడిలో సత్తా ఇంకా నిలిచే ఉందన్నాడు. అతడి సత్తా గురించి తనకు తెలుసునని, తిరిగి పుంజుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. యువరాజ్ ను విమర్శించండి కానీ శిక్షించకండని సూచించాడు. అదే సమయంలో 'ఒక్క మ్యాచ్ లో విఫలమైనంత మాత్రాన నీలో సత్తా తగ్గినట్లు కాదు యూవీ. 2015 ప్రపంచకప్ ను కూడా కైవసం చేసుకోవడంలో భారతీయులు నీ భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నారు' అంటూ సచిన్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. యువరాజ్ కు ఇప్పటికే కెప్టెన్ ధోనీ, బాలీవుడ్ తారలు బాసటగా నిలిచిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News