: గుంటూరు జిల్లాలో టీడీపీ, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ధూళిపాళ్లకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.