: శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రపతి శుభాకాంక్షలు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రాముడు వ్యక్తిగతంగా మానవీయ విలువలకు ప్రతీక అని, పాలకుడిగా ఉన్నత ప్రమాణాలకు, నైతిక ధార్మిక విలువలకు కట్టుబడిన మహనీయుడని కొనియాడారు. శ్రీరామనవమి సందర్భంగా ఆయన ఆదర్శాలను గుర్తు చేసుకుని, ఆచరించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని రాష్ట్రపతి సూచించారు.