: భారత స్టాక్ మార్కెట్లకు రేపు సెలవు
శ్రీరామనవమి పండగ సందర్భంగా రేపు భారత స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్, ఫారెక్స్, మనీ మార్కెట్లు రేపు బోసిపోనున్నాయి. హోల్ సేల్, కమాడిటీ, బులియన్, మెటల్ మార్కెట్లకు కూడా పండగను పురస్కరించుకుని సెలవు ప్రకటించారు. దీంతో భారత్ లో స్టాక్ మార్కెట్ వ్యవస్థ మొత్తం రేపు స్థంభించనుంది.