: బెంగళూరులో మహేష్ హల్ చల్


ప్రముఖ సినీ హీరో మహేష్ బాబు బెంగళూరులో హల్ చల్ చేశాడు. ప్రముఖ నగల కంపెనీ జోస్ అలూకాస్ కు బ్రాండ్ అంబాసిడర్ అయిన మహేష్ ఇక్కడ ఏర్పాటు చేసిన కొత్త బ్రాంచ్ ను ప్రారంభించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కర్ణాటకలోనూ తనపై అభిమానం చూపుతున్నందుకు సంతోషంగా ఉందన్నాడు. కాగా, అప్పటికే తమ అభిమాన నటుడి రాకకోసం ఎదురుచూస్తున్న వందలాది అభిమానులతో రాజధానిలోని రాజాజీనగర్ మొదటి బ్లాక్ నిండిపోయింది. కొంతమంది యువకులైతే ఒకరిపై ఒకరు ఎక్కి మహేష్ ను చూసేందుకు పోటీ పడ్డారు. కేవలం 20 నిమిషాల్లోనే కార్యక్రమం పూర్తయి మహేష్ వెళుతుండగా పెద్దగా అరుస్తూ నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News