: పవన్ కల్యాణ్ కు వర్మ బహిరంగ లేఖ


నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు దర్శకుడు రాంగోపాల్ వర్మ బహిరంగ లేఖ రాశారు. 'రాజకీయ పార్టీ పెట్టాలనుకున్న మీ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. మీ నిజాయతీ, చిత్తశుద్ధి నాకెంతో స్పూర్తిదాయకం. జనసేన పార్టీ ఆవిర్భావం రోజున మీ ప్రసంగం పట్ల నేను ఆకర్షితుడనయ్యాను. ఈ నేపథ్యంలో మొదట్లో నేను మీ 'ఇజం' పుస్తకం పట్ల చాలా ఊహించుకున్నాను. ఎందుకంటే, మీ గురించి తెలియనప్పుడు నేను చాలా విన్నాను, గమనించాను. గుడ్డిగా ఎవరినీ నమ్మి ఆధారపడవద్దు. జనసేన, ఇజం పుస్తకం వెనక రాజు రవితేజ ఉన్నారు. పార్టీ లాంఛింగ్ సమయంలో చేసిన ప్రసంగంలో మీలో చాలా స్పష్టత ఉంది. ఎందుకంటే, అదీ మీ సొంతది కాబట్టి. కానీ, విశాఖ సభ స్పీచ్ లో అటువంటి క్లారిటీ కనిపించలేదు. ఎందుకంటే అందులో అతని (రాజు రవితేజ్) ప్రభావం ఎక్కువగా ఉంది' అని వర్మ వివరించాడు. ఈ క్రమంలో స్నేహితుడైన రవితేజ పవన్ ని పక్కదారి పట్టించేలా చేస్తున్నాడని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News