: వైఎస్సార్సీపీకి అవకాశం ఇవ్వొద్దు: లోక్ సత్తా నేత వర్మ
వైఎస్సార్సీపీ కుటుంబ పార్టీ అని, దానికి అవకాశం ఇవ్వొద్దని లోక్ సత్తా నేత వర్మ సూచించారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ వెనుక అవీనితి చరిత్ర ఉందని అన్నారు. సీమాంధ్రలో లోక్ సత్తా ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పిన వర్మ, 13 ఎంపీ స్థానాలకు, 60 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను నిలబెడుతున్నట్టు చెప్పారు.