: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మే 24కే జీతాలొస్తున్నాయ్!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మే 24 నే జీతాలొస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించిన మే నెల జీతాలను 24వ తేదీనే చెల్లించాలని జీవోలో పేర్కొన్నారు. జూన్ 2వ తేదీన అపాయింటెడ్ డే సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి అన్ని రకాల చెల్లింపులకు మే 24న చివరి తేదీ కావడంతో ఆ రోజునే జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. మే 25 నుంచి రెండు రాష్ట్రాలకు సంబంధించి కొత్త అకౌంట్లు ప్రారంభం కానున్నాయి.