: 'హ్యారీ పోటర్' నటుడు గ్రిఫిత్ కన్నుమూత
'హ్యారీ పోటర్' చిత్రాల్లో 'వెర్నాన్ డర్స్ లే' పాత్రతో అభిమానులను అలరించిన హాలీవుడ్ నటుడు రిచర్డ్స్ గ్రిఫిత్స్ కన్నుమూశారు. ఆయన వయస్సు 65 సంవత్సరాలు. ఇటీవలే గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటినుంచి ఆయన తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. చికిత్స పొందుతూ నేడు ఇంగ్లండ్ లో మరణించారు. కాగా, ఆయన మృతిపై 'హ్యారీ పోటర్' పాత్రధారి డేనియల్ రాడ్ క్లిఫ్ స్పందించాడు. తాను గ్రిఫిత్స్ తో కలిసి పలు నాటకాలు వేయడంతో పాటు సినిమాలూ చేశానని గుర్తు చేసుకున్నాడు. అతనితో పరిచయం పట్ల గర్విస్తున్నట్టు రాడ్ క్లిఫ్ చెప్పాడు.