: నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసు నమోదు
నెల్లూరు జిల్లాలోని పెళ్లకూరు మండలంలో ఓటర్లను ప్రలోభపెడుతున్న 10 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మండలానికి వైఎస్సార్సీపీ నుంచి సత్యనారాయణరెడ్డి జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనను గెలిపించాలంటూ కొందరు వైఎస్సార్సీపీ కార్యకర్తలు చీరలు పంపిణీ చేస్తున్నారు. చీరలతో నిండిన ఓ వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.